కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక నిర్ణయం

3 బ్యారేజీలకు రిపేర్ పనులు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్: కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీక్ష నిర్వహించిన సీఎం రవేంత్ రెడ్డి. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు బ్యారేజీలను మరమ్మతుల అనంతరం వినియోగంలోకి తీసుకురావాల‌ని చెప్పారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా బ్యారేజీల మరమ్మతు ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రోజున జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అప్ర‌మ‌త్తం చేసి ప‌నుల్లో వేగం పెంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్న‌ ప‌రీక్ష‌లు, న‌మూనాల సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. నీటిపారుద‌ల శాఖ, సీడ‌బ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థ‌లు, డిజైన్ కన్సల్టేషన్స్‌తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజిని అధ్య‌య‌నం చేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. అందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వ‌ర‌గా పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని చెప్పారు. అదే సమయంలో పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పనులకు నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని తెలిపారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. ఇదిలాఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి, నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సూచించానని కూడా చెప్పారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 10) రోజున ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసంసీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళతారు. రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.