ఆన్‌లైన్ ఫ్రాడ్‌లకు చెక్ పెట్టేందుకు RBI భారీ కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్: యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి రానున్నాయి. డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఖాతాదారుల నగదు భద్రత కల్పించేందుకు డిజిటల్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు క్విల్ స్విచ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే ఇకపై రూ. 10వేలకు పైగా పేమెంట్లుచేస్తే గంట వరకు వేచి చూసేలా కొత్త నిబంధనలను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడం ప్రతీ దానికి డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ గణనీయంగా పెరగడంత అంతేస్తాయిలో డిజిటల్ మోసాలు సైతం పెరిగాయి.ఈ డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు, ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భద్రతను పెంచడానికి ఆర్‌బీఐ నాలుగు అంచెల రక్షణ వ్యవస్థను ప్రతిపాదించింది. ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ కొన్ని సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది. గంట దాటాకే చెల్లింపులు, కిల్ స్విచ్ వంటి ప్రతిపాదనలను ఆర్బీఐ తీసుకువచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది.ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఈ 5 ప్రతిపాదనలను అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గంట తర్వాతే లావాదేవీలు ఆర్‌బీఐ ప్రతిపాదన ప్రకారం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రూ. 10,000 పైబడిన లావాదేవీలను గంట సేపు నిలిపివేయనున్నారు. ఒక వ్యక్తి అకౌంట్ నుంచి రూ.10వేలు వేరొక వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేస్తే అవతలి వ్యక్తి అకౌంట్‌లోకి ఆ నగదు చేరేందుకు గంట సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో మీ నగదు మోసగాడి ఖాతాలోకి వెళ్తున్నట్లు అనుమనం వస్తే ఆ లావాదేవీని రద్దు చేసే అవకాశం ఖాతాదారుడికి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాల్లో భారీ డిజిటల్ పేమెంట్లను ఎక్కువ సమయం హోల్డ్ చేయనుంది. కిల్ స్విచ్ విధానంతో రైతులకు లబ్ధి. ఖాతాదారుడు తన ఖాతాలో ఏదైనా అనుమానాస్పద, అనధికార లావాదేవీలు జరిగిందని అనుమానం వస్తే వెంటనే అతడి డిజిటల్ లావాదేవీలను నిలిపివేసేలా ఒక క్విల్ స్విచ్ ఆప్షన్‌ను కూడా బ్యాంకులు అందుబాటలోకి తీసుకురావాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ క్విల్ స్విచ్‌ను ఆప్షన్‌ను ఆర్బీఐ ప్రతిపాదించింది. దీంతో యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ, కార్డు లావాదేవీలన్నీ అక్కడికక్కడే నిలిచిపోతాయి. ఈ కిల్ స్విచ్ వల్ల ఖాతాదారుడు లబ్ధిపొందనున్నాడు. మ్యూల్ ఖాతాలపై నిఘా. దేశంలో డిజిటల్ పేమెంట్ల మోసాలకు పాల్పడే వారు మ్యూల్ ఖాతాలను వినియోగిస్తుంటారు.ఎందుకంటే సైబర్ నేరగాళ్లు తమ ఆచూకీ పోలీసులకు దొరకకుండా మ్యూల్ ఖాతాలను(వేరేవాళ్ల ఖాతాలను)వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో మోసపూరిత ఖాతాలను గుర్తించేందుకు, సరైన ధృవీకరణ లేని ఖాతాల్లో వార్షిక క్రెడిట్ పరిమితిని రూ.25 లక్షలకు పరిమితం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.