హజ్ యాత్రకు ఏపీ నుంచి 2000 మంది ఎంపిక

ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదేశాలు

జనం న్యూస్: హజ్ యాత్ర-2026కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. ఏపీ నుంచి హజ్‌కు 2000 మంది ప్రయాణికులు హజ్ యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి అని అధికారులను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హజ్ - 2026 కి మొత్తం 2000 మంది యాత్రికులు బయలుదేరనున్నారని, అందులో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి ఏప్రిల్ 18 మరియు 19 తేదీలలో 352 మంది ప్రయాణికులు బయలుదేరనున్నారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికార యంత్రంగాన్ని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్ లో హజ్ క్యాంప్ -2026 కు ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున అన్ని సౌకర్యాలతో హజ్ భవన్ నిర్మించడం జరిగిందన్నారు. అప్పట్లో హైదరాబాదులో కూడా ఎంబార్కేషన్ కేంద్రం ఉండేది కాదని, అప్పటి ప్రధాని వాజ్ పేయి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్లడంతో ఏంబార్కేషన్ కేంద్రం మంజూరు అయిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రయాణికులకు ఏంబార్కేషన్ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాలలోని కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నదన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కేంద్రం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి విజయవాడకు ఏంబార్కేకేషన్ కేంద్రం మంజూరు చేయించారని అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారికి , పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మంత్రి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు.పవిత్ర మక్కాయాత్ర హజ్ కు వెళ్లే యాత్రికులందరికీ, అన్ని రకాల మౌలిక సదుపాయాలతో విజయవాడలో హజ్ హౌస్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి హజ్ కి వెళ్లే ప్రయాణికులు అందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లిం మైనారిటీల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.