ప్రయాణికుల ఆందోళన-ఒక్కసారిగా 14 రైళ్లు రద్దు

★ ఆ మార్గంలో రైళ్ల రద్దు-ప్రయాణికులకు ముఖ్య సూచనలు

పయనించే సూర్యుడు న్యూస్ : సౌత్ సెంట్రల్ రైల్వే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాచిగూడ మహబూబ్‌నగర్ కర్నూల్ రాయచూర్ గద్వాల్ మార్గాల్లో పలు ప్యాసింజర్ రైళ్లు 10 నుంచి 19 వరకు రద్దు చేసింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రయాణికులకు షాక్ ఇచ్చింది South Central Railway. నిత్యం ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే కొన్ని రైళ్లను వివిధ కారణాలతో రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రోజువారీగా ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రద్దయిన రైళ్ల వివరాలు: 1. రైలు నెంబర్: 67781 (కాచిగూడ - మహబూబ్ నగర్), ఈ రైలును ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 2. రైలు నెంబర్: 67782 (మహబూబ్ నగర్ - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 3. రైలు నెంబర్: 67787/67788 (కాచిగూడ - రాయచూరు - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.4. రైలు నెంబర్: 57441 (గుంతకల్ - బోధన్), ఈ రైలును ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 5. రైలు నెంబర్: 57414 (బోధన్ - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 6. రైలు నెంబర్: 57412 (కాచిగూడ - గుంతకల్), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 7. రైలు నెంబర్: 17435 (కాచిగూడ - కర్నూల్ సిటీ), ఈ రైలును ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 8. రైలు నెంబర్: 17436 (కర్నూల్ సిటీ - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 9. రైలు నెంబర్: 17693 (కాచిగూడ - రాయచూర్), ఈ రైలును ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 10. రైలు నెంబర్: 17694 (రాయచూర్ - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 11. రైలు నెంబర్: 67783 (రాయచూర్ - గద్వాల్), ఈ రైలును ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 12. రైలు నెంబర్: 67784 (గద్వాల్ - రాయచూర్), ఈ రైలును ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 13. రైలు నెంబర్: 77641 (కాచిగూడ - మహబూబ్ నగర్), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 14. రైలు నెంబర్: 77642 (మహబూబ్ నగర్ - కాచిగూడ), ఈ రైలును ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, రాయచూర్, కర్నూల్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలని అధికారులు సూచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పై తెలిపిన తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.