
జనం న్యూస్: ‘నిఖార్సైన జీవన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ అవమానపరుస్తోంది. కేసీఆర్‌ను కూడా కలిసి తన నిర్ణయం ప్రకటిస్తాం’అని జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు జీవన్ రెడ్డిని తమ సహచరులందరితో కలిసి సాదరంగా ఆహ్వానించేందుకు వచ్చాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ‘2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ నిబద్ధత గల నాయకుడిగా ఆయన కాంగ్రెస్‌తోనే కొనసాగారు.కేసీఆర్, జీవన్ రెడ్డి బంధం ఈనాటిది కాదు. 2 జూన్ 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి సారి జగిత్యాలకు వచ్చారు. ఆ రోజు బోర్నపల్లి బ్రిడ్జి గురించి జీవన్ రెడ్డి కేసీఆర్‌ను అడిగారు. ఆయన అడిగిందే తడవుగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సాంక్షన్ ఇచ్చారు’అని కేటీఆర్ గుర్తు చేశారు. నిఖార్సైన నేతలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కరీనంగర్‌లో షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డి ఫైట్ చేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మహారాష్ట్ర తరహా కో ఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో పెడదామన్నారు అని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి చేరిక బాగుంటుందని జగిత్యాల నాయకత్వం కూడా మద్దతు తెలిపింది అని చెప్పుకొచ్చారు.నిఖార్సైన జీవన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ అవమానపరుస్తోంది. నేను భట్టి ఇంటికి పెళ్లికి పోయినప్పుడు కూడా వంద మంది రాబోయేది మీ ప్రభుత్వమే అని అన్నారు. కేసీఆర్‌ను కూడా కలిసి తన నిర్ణయం ప్రకటిస్తామన్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. బాసరలో సీఎం రేవంత్ రెడ్డి భాష అసహ్యంగా ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాలం నెట్టుకొచ్చే ప్రభుత్వం ఇది అంటూ ధ్వజమజెత్తారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని.. 70 లక్షల కోట్లు రైతులకు బకాయి పడ్డారు అని చెప్పుకొచ్చారు. బాసరలో ముఖ్యమంత్రి భాష అసహ్యంగా ఉంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనే నయం: జీవన్ రెడ్డి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలన తిరోగమనంలో నడుస్తుందంటూ ధ్వజమెత్తారు.నష్టపోయిన ప్రతి రైతును గత ప్రభుత్వం ఆదుకుందని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తర్వాత బెటర్ పాలన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌కు ప్రచార ఆర్భాటాలు తప్ప, ప్రజాహితంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. దీని ద్వారానే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని మాజీమంత్రి జీవన్ రెడ్డి వెల్లడించారు.