
అక్షర ఆయుధం : గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మాజీమంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా ఏప్రిల్ 9 బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరగా తొలుత ఇచ్చారు. ఇంతలో ఒక రోజు ముందే సభకు అనుమతులు నిరాకరించడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈనెల 9న హరీశ్ రావు తలపెట్టనున్న బహిరంగ సభకు పోలీసులు రద్దు చేశారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నారు.అయితే రైతుల పోరాటానికి మద్దతుగా ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్ రావు భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అందుకు పోలీసులను అనుమతి సైతం కోరారు.ఈ క్రమంలో ఈ బహిరంగ సభ కోసం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా గతంలో ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కలవరపాటు గురయ్యారు. హరీశ్ రావు సభకు అనుమతి రద్దు వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా మాజీమంత్రి హరీశ్ రావు చేపట్టబోయే బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. గతంలోనే సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఒక రోజు ముందుగా అకస్మాత్తుగా సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభకు తొలుత అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలని చూడటం దుర్మార్గమని మాజీమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా...తాము వెనక్కి తగ్గేది లేదని....హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతులు తెచ్చుకుంటామని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడం: మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్తేం కాదు అని బెదిరింపులకు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతాంగ ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని...ఈ నెల 9న హరీశ్‌రావు సభను జరిపి తీరుతామని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ప్రజలు, రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మెుబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే గొల్లపల్లి రిజర్వాయర్ ఏడు టీఎంసీల ఏదుల రిజర్వాయర్ ఉండగా పక్కనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ పూనుకుందని...కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే తెరమీదకు వచ్చిన గొల్లపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తీసుకువచ్చిందని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. దాదాపుగా 100 రోజులుగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైతుల పోరాటానికి మాజీమంత్రి హరీశ్ రావు మద్దతుగా నిలిచారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులు పూర్తి చేస్తే నార్లాపూర్, ఏదులతో పాటు వట్టెం, కరివెనలో నీటిని నింపుకునే అవకాశం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల టెండర్లు రద్దు చేసిన కాంగ్రెస్ అని మండిపడ్డారు. చేయాల్సిన పనులు వదిలేసి, గొల్లపల్లి రిజర్వాయర్ ముందుకు వేసుకోవడంపై 100 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారని, రైతులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు రానున్న నేపథ్యంలో అనుమతులు ఇచ్చి రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.