
అక్షర ఆయుధం ; కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మీ పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణంగా అభివర్ణించారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది అని అన్నారు.‘మై టీడీపీ యాప్’ టాప్ 10 ఫెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ‘తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొంటారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కార్యకర్తే అధినేత. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో వరకు రాగలగాలి అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. 2019-24 మధ్య జగన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. వారానికోరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాం. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చట్ట సవరణ చేశాం. మీరందరూ క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం అందరినీ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో ఆత్మీయ భేటీ పట్ల ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. తాము జీవితాంతం మర్చిపోలేమని మంత్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్ కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన సామాన్యులు, పార్టీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని...డిపోను మోటమర్రికి లేగా డోర్నకల్‌కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు.హైర్ బస్సులను రీప్లేస్‌మెంట్ కల్పించి ఆదుకోవాలి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్‌ను కోరారు.