తెలంగాణ అభివృద్ధిలో ఎలాంటి తారతమ్యం లేదు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

★ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువే పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలి

అక్షర ఆయుధం : తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ, అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉటంకించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖనిజ సంపద ‘రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎక్కడా పార్టీలను చూడలేదు. ఆడబిడ్డల కష్టాలను మాత్రమే చూశాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ సమీప భవిష్యత్తులో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. జిల్లాలో అపారమైన జలవనరులు, అపారమైన ప్రాచీన సంస్కృతి ఉంది. అయినప్పటికీ వ్యవసాయం విస్తరించలేదు. విద్య, వైద్యం అందలేదు. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడానికి పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో మాట్లాడాం. గతంలో ఇలా మాట్లాడే సంస్కృతి లేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లా ఇంచార్జి మంత్రి అవసరమైన చర్యలు తీసుకుంటారు’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘2027 మార్చి 31 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల సరిహద్దులను మార్చడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం కట్టడి విధించింది.