
సాక్షి డిజిటల్ న్యూస్ : పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదన లకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ , సీఎస్ జి.సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి పెటుబడులు రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్టు చేసేలా చూడాలని మంత్రి లోకేశ్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని...ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కంజ్యూమర్ ప్రాడెక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపూర్ లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ జీసీసీలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రాడెక్టులు వచ్చేలా చూడాలని దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రం నుంచి సహకారం కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటం పై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.