బాసర సరస్వతీ ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం

★ పవిత్ర ఆలయంలో మధుర క్షణం-మనవడికి అక్షరాభ్యాసం చేసిన సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 6) రోజున నిర్మల్ జిల్లాలోని బాసరను సందర్శించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 6) రోజున నిర్మల్ జిల్లాలోని బాసరను సందర్శించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రియాన్ష్‌కు బాసర సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి... సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఆయన సతీమణి గీత, కుమార్తె నైమిషా రెడ్డి దంపతులు, మనవడు రియాన్ష్ ఉన్నారు. ముందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన మనవడు రియాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్... రియాన్ష్ కు పలక బలపంతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక, ఈ పర్యటన సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు గారు తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. తద్వారా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని పునరుద్ధరించి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రూ. 225 కోట్లతో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు నగేష్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, దండే విఠల్, సి. అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, వెడ్మ బొజ్జు, ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.