జనం న్యూస్: ‘నన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి రావాలని ఆనాడు ఆహ్వానించారు. అంతేకాదు కోరుకున్న మంత్రిపదవి ఇస్తా అని ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ కమిట్మెంట్తో ఉద్యమంలోనే కొనసాగాను’అని ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు.‘మనందరి ఎజెండా కేసీఆర్‌ను ఓడగొట్టాలని. కాబట్టి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌కి పోదాం అన్నారు. పోయి ఉంటే నేను మంత్రినో,డిప్యూటీ సిఎం నో అయ్యే వాడిని అని ఎంపీ ఈటల చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరతున్నాను అంటూ వస్తున్న వార్తలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తేలేదు అని చెప్పుకొచ్చారు. పార్టీ మారకూడదని తానే సందేశం ఇచ్చానని. అలాంటిది తాను పార్టీ ఎలా మారతానని చెప్పుకొచ్చారు. అయినా పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల క్రితం కేసీఆర్ తనను బీఆర్ఎస్ నుంచి గెంటేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించడమే కాకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గతంలో తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆనాడే ఆ పార్టీలోకి వెళ్లి ఉంటే డిప్యూటీ సీఎంనో,మంత్రినో అయ్యి ఉండేవాడిని అని మాజీమంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ‘నన్ను కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పంపించి 5 ఏళ్లు అవుతుంది. దాంతో నేను బీజేపీలో చేరాను. మేము పార్టీ మారుతున్నామనీ కొంతమంది పోస్టర్లు వేస్తున్నారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజి కాదు’అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.‘పార్టీలు మారకూడదు నేనే సందేశం కూడా ఇచ్చాను. నా గురుంచి తెలంగాణ సమాజంకి తెలుసు. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. 25 ఏళ్లు ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్నవారు, అభిమానించే వారు BRSలో ఉన్నారు. ఈటలను పొగుట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారు.ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది’అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.‘మళ్ళీ వీళ్లందరూ కేసీఆర్‌తో కలుస్తారు అని చర్చ జరుగుతుంది.ఇలాంటి పిచ్చివి చేయవద్దు’అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ నన్ను ఇబ్బందిపెట్టారు. ‘కేసీఆర్ నన్ను బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారు.ఆయన చేయని పనిలేదు. కోళ్ళ ఫార్మ్ లు కూల్చారు. భూములు గుంజుకున్నారు’మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అంతేకాదు నేను లీగల్‌గా కొనుక్కున్నవి చెరబట్టారు. నేను సీఎంకు లేఖ రాస్తాను. సందర్భం వస్తే ఈటెల రాజేందర్ ఏంటో తెలుస్తుంది అని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది అయితే మీడియా ను మేనేజ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బుకాయిస్తు దబాయిస్తుంది’అని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 6మంది ఎంపీలం ఉన్నాం. మా ఎమ్మెల్యేలము కలిసి కార్యక్రమాలు చేయబోతున్నాం అని ఈటల చెప్పుకొచ్చారు.‘మొదటి ప్రోగ్రాం చలో బాలాజీ నగర్ చేపట్టాలని అనుకున్నాం.GHMC పరిధిలో జరిగే ఎన్నికల్లో సర్వేలు చేస్తున్నాం. గెలుస్తాం. అన్ని పార్టీల్లో సమస్యలు ఉంటాయి. వైవిధ్యం, పోటీ ఉంటుంది’అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఆఫర్ చేసిన వైఎస్ఆర్. ‘అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇతర పార్టీల నుండి వస్తారు అంటారు.నన్ను వైఎస్ రాజశేఖర్ పార్టీలోకి రావాలని కోరారు. కోరుకున్న మంత్రిపదవి ఇస్తా అని ఆఫర్ ఇచ్చారు. కానీ కమిట్మెంట్తో ఉద్యమంలోనే కొనసాగాను’అని ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు.‘మనందరి ఎజెండా కేసీఆర్‌ను ఓడగొట్టాలని. కాబట్టి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌కి పోదాం అన్నారు. పోయి ఉంటే నేను మంత్రినో,డిప్యూటీ సిఎం నో అయ్యే వాడిని. నేను పదవుల కోసం పాకులాడను. చిల్లర మాటలు మాట్లాడతూ ఉన్నారు. ప్రజల్ని, ధర్మాన్ని నమ్ముకున్నాను. సోషల్ మీడియా ను నమ్ముకోలేదు’అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. నా పార్టీ ఆలోచనే నా ఆలోచన ‘నా పార్లమెంట్ పరిధిలో నాకున్న అవగాహాన వేరే వారికి ఉండదు కదా. డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలో నాకు తెలియదా?’అని ఎంపీ ఈగటల రాజేందర్ అన్నారు.‘హుజూరాబాద్ మీ పరిధి కాదు అన్నారు. ఎన్నికలప్పుడు అటు పోలేదు. హుజురాబాద్‌లో నేను ఉన్నప్పుడు మున్సిపల్ ఛైర్మన్, ZPTC ఓడిపోలేదు. ఈ సారి ఆ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవద్దు అన్నారు చేసుకోలేదు. Ghmc పరిధిలో గెలిచే వారికి టికెట్లు... నా వాడు కాదు అని టికెట్ ఇవ్వడం ఉండదు. పార్టీ గెలవాలని , ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటాం’అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.‘నా పార్టీ ఏమీ ఆలొచిస్తుంది అదే నేను కూడా ఆలోచిస్తా. మా పార్లమెంట్ సమస్యల పై, CSR నిధుల పై మేము కూడా ప్రధాని మోడీకి లేఖ రాశాం’అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.