అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

కనకదుర్గమ్మ ఆలయంలో మహిళా రైతుల మొక్కులు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన సందర్బంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మ వారికి సారె, చీర, సంభారాలతో ఉదయం 8గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్, లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన సందర్బంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మ వారికి సారె, చీర, సంభారాలతో ఉదయం 8గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్, లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ) కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో వీకే శీనా నాయక్ ఆధ్వర్యంలో అర్చకబృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులను స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను చైర్మన్, ఈవో వార్లు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. ఉభయ సభలలో బిల్లు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు బుధవారం రోజున లోక్‌సభ ఆమోదం తెలుపగా గురువారం రోజున రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఆమోదించినట్టు అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి చట్టబద్దత కల్పించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్-5(2)ను సవరించి. ‘అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసనసభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని అనంతరం కేంద్రం వద్దకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. బుధవారం రోజున లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. వైసీపీ మినహా లోక్‌సభలోని దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతునిచ్చాయి. ఈ బిల్లు సమయంలో వైసీపీ సభ్యులు సభలో నుంచి వాకౌట్ చేశారు. బిల్లు చారిత్రాత్మకం. లోక్‌సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), 2026 బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చ ప్రారంభించారు.