
సాక్షి డిజిటల్ న్యూస్ : IPL 2026 SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి, ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను అవుట్ చేసిన మహ్మద్ షమీ.. మాజీ భార్యను తలుచుకుని బౌలింగ్ చేసినట్టుగా, మాజీ టీమ్‌పై చెలరేగిపోయాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్..IPL 2026 SRH vs LSG: ఐపీఎల్ 2026 సీజన్లో సీనియర్ పేయర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు, మొదటి మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికి కెఎల్ రాహుల్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీ, తన మాజీ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదిరిపోయే రివెంజ్ తీర్చుకున్నాడు.రూ.10 కోట్లకు కొని..ఐపీఎల్ 2025 మెగా వేలంలో మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. IPL 2023 సీజన్లో 17 మ్యాచుల్లో 28 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ గెలిచిన మహ్మద్ షమీపై భారీ అంచనాలు పెట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో మహ్మద్ షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 మ్యాచులు ఆడిన మహ్మద్ షమీ, 6 వికెట్లు మాత్రమే తీశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయకుండా 75 పరుగులు సమర్పించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించిన భారత బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు మహ్మద్ షమీ.విడుదల చేసిన సన్‌రైజర్స్.. ఐపీఎల్ 2025 సీజన్లో మహ్మద్ షమీ పర్ఫామెన్స్ చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, ఒకే సీజన్‌కే అతన్నే టీమ్ నుంచి విడుదల చేసింది. ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి మహ్మద్ షమీని రూ.10 కోట్లకు అమ్మేసింది. Ex-టీమ్‌పై రివెంజ్..ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహ్మద్ షమీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మొదటి ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మను డకౌట్ చేసిన మహ్మద్ షమీ, రెండో ఓవర్లో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ని కూడా అవుట్ చేశాడు.మొదటి ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ, రెండో ఓవర్లో కూడా ఒకే పరుగు ఇచ్చాడు. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది. తన మూడో ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ, ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చి 2 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీకి తోడు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రతి టాప్ క్లాస బౌలింగ్ పర్ఫామెన్స్ కారణంగా పవర్ ప్లేలో 22/3 స్కోరు మాత్రమే చేయగలిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 35/4 స్కోరు మాత్రమే వచ్చింది.అరవీర భయంకర బ్యాటర్లు, విధ్వంసక ప్లేయర్లు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 2 ఓవర్లలో చేసే 35 పరుగులు చేయడానికి, 10 ఓవర్లు పట్టింది.అరుదైన లిస్టులోకి...ఐపీఎల్లో 4 ఓవర్లలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో చేరాడు మహ్మద్ సమీ. ఇంతకుముందు ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఆశీష్ నెహ్రా 4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి టాప్‌లో ఉన్నారు.