
సాక్షి డిజిటల్ న్యూస్ : సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం గుడ్‌న్యూస్ తెలిపింది.యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ.10 లక్షలు బీమా సౌకర్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు, యాజమాన్యం పేర్కొంది.ఇప్పటికే సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే.సింగరేణి కార్మికుల కోసం యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజంగా మరణించినా కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్సు గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సహజ మరణానికి రూ.10 లక్షలు యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు జరిపింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో 10 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే కనీసం ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి రూ.10 లక్షల బీమా పథకాన్ని అమలు జరిపింది.సహజ మరణానికి కూడా బీమా సౌకర్యం సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇకపోతే ఇప్పటికే సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోంది.కోటి రూపాయల ప్రమాద బీమా సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవాల్సింది పోయి ప్రోత్సహించిందని ఆరోపించారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6వేల కోట్లు అప్పులు చెల్లించేదని.. ఈ పదేళ్లలో ఏడాదికి రూ.70వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. రూ.70వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్రం ఇంత ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా ప్రతీ నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ.. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా తమ ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు చేస్తోందని అన్నారు.