
జనం న్యూస్: ‘నాదర్‌గుల్‌లో రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు’ అని మాజీమంత్రి,బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు.‘హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారు’అని మండిపడ్డారు.‘ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక ఉన్నది సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి కుటుంబమే’అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోంది’అని మాజీమంత్రి,బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.‘నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7 వేల కోట్ల రూపాయల భారీ స్కాం జరుగుతోంది. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు,మంత్రులు ఉన్నారు. రక్షకులే భక్షకులుగా మారారు’అని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి రైతులను భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. రూ.7వేల కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ పెద్దల కన్ను. ‘నాదర్‌గుల్‌లో రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారు. ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక ఉన్నది సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబమే’అని మాజీమంత్రి,బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ‘ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి APIICకి అప్పగించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రేవంత్ రెడ్డి కన్ను ఈ భూములపై పడింది. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లను, రౌడీలను పెట్టి పోలీసుల చేత దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు’అని మాజీమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు. ‘కౌసల్య, మమత లాంటి మహిళా రైతులు 40 ఏళ్లుగా ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నారు. వారికి 5, 10 లక్షలు ఆశచూపి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. బోర్లు, కంచెలు ధ్వంసం చేశారు. మహిళలను రౌడీల చేత బెదిరిస్తున్నారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు’అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.