
జనం న్యూస్: రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ఎప్పుడు వెళ్లినా... మనసంతా భావోద్వేగంతో నిండిపోతుంది. రాజధాని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత నాపై ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అమరావతి చట్టబద్ధతకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేం’అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పట్టలేని ఆనందంలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల దీపహారతి కార్యక్రమానికి పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దీపహారతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి నుంచి దీపాలు వెలిగించి మద్దతు ప్రకటించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి పార్టీల కార్యాలయాల వద్ద కూడా దీపాలు వెలిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.అమరావతి ఆత్మగౌరవం గెలిచింది. పార్లమెంటు చట్టబద్ధతతో రాజధానికి నేడు తిరుగులేని శాసనం దక్కింది అని అభిప్రాయపడ్డారు. 1631 రోజుల రైతుల వీరోచిత పోరాటం విజయవంతం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు సందడి చేశారు.దీపహారతి ఇచ్చి పుణ్యభూమికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ సందర్భంగా నాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రైతులు చాలా మంది సీఎం చంద్రబాబు నాయుడును కలిసి నాటి సంగతులను గుర్తు చేశారు. ఉద్యమ శిబిరాల్లో రైతుల కన్నీళ్లు, ఉద్యమ ఘటనలు 1,631 రోజుల రైతులు, మహిళల వీరోచిత పోరాటాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ఎప్పుడు వెళ్లినా మనసంతా భావోద్వేగంతో నిండిపోతుంది. రాజధాని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత నాపై ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అమరావతి చట్టబద్ధతకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేం’అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు జాతి గౌరవం అమరావతి “అమరావతికి అపజయం లేదు అన్ స్టాపబుల్. ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజా విజయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానికి ధన్యవాదాలు. హోం మంత్రి అమిత్ షా సహా కేంద్రం, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు సహకరించాయి. పవిత్రమైన మట్టి-నీటిని రాజధాని శంకుస్థాపన చేసిన రోజున ప్రధాని తెచ్చారు. పార్లమెంట్ వద్ద ఉన్న పవిత్ర మట్టిని పవిత్ర యమునా నది జలాలతో పునీతమైన పుణ్యభూమి ఇది. దేశం మొత్తం అమరావతికి అండగా ఉంటుందని నాడే ప్రధాని మోదీ చెప్పారు.