ఉద్యోగుల వేతనాలపై సత్వర చెల్లింపుల దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇకపై ప్రతీ నెల ఉద్యోగుల అకౌంట్‌లో నగదు జమ చేయాలని నిర్ణయించింది. గతంలో విడతల వారీగా జీతభత్యాలు చెల్లించే వారు. మూడు లేదా ఆరు నెలలకోసారి జీత భత్యాలు చెల్లించేవారు. అది కూడా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సంస్థలు ఆ నగదు జమ చేసేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపులో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల జీతాలను చెల్లించేది. అయితే ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెల జీతాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లోనే జమ చేయనుంది. ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల అకౌంట్‌లో నగదు జమ చేస్తే మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. ఉద్యోగుల అకౌంట్‌లోకి నగదు జమ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇకపై ప్రతీ నెల ఉద్యోగుల అకౌంట్‌లో నగదు జమ చేయాలని నిర్ణయించింది. గతంలో విడతల వారీగా జీతభత్యాలు చెల్లించే వారు.మూడు లేదా ఆరు నెలలకోసారి జీత భత్యాలు చెల్లించేవారు. అది కూడా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సంస్థలు ఆ నగదు జమ చేసేవి. లేకపోతే మధ్యవర్తులు సైతం నగదు జమ చేసేవారు. అయితే వారు చెల్లించే జీతానికి జీవోలో ప్రకటించిన జీతానికి చాలా వ్యత్యాసం ఉండేది. ఈ వ్యత్యాసాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా నగదు జమ చేయనుంది. కార్మికుల వేతన కష్టాలకు ఊరట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్టకు ముగింపు పలికే అవకాశం ఉంది. అంతేకాదు వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంట్, మైనార్టీ సంక్షేమ శాఖ మున్సిపాలిటీలు వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికుల వేతన కష్టాలకు ఊరట లభించే అవకాశం ఉంది. ఐఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం (ఐఎఫ్ఎంఎస్) ఇంటిగ్రేటెడ్, ఫైనాన్షియల్, మేనేజ్మెంట్, సిస్టమ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. ఇదే మాదిరిగానే ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా కార్యాలయాల అధికారులు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను అనుసంధానం చేసి ఆయా శాఖల ఉన్నత అధికారులకు నివేదికలు పంపించినట్లు తెలుస్తోంది. కార్మికుల కళ్ళలో ఆనందం! తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం లో (పీహెచ్) ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ వర్కర్లు, (నాన్ పిహెచ్ ) పబ్లిక్ హెల్త్ నైపుణ్య కార్మికులు (పారిశుద్ధ్య కార్మికులు ) హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్యఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ విభాగాల్లో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ప్రతీనెల జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఊరట లభించినట్లు అయ్యింది. ఐఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించడంతో నెలవారి ఖర్చులకు ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. అప్పులు చేసి వడ్డీలకు వడ్డీలు కట్టాల్సిన అవసరం అసలే లేదు. మెుత్తానికి ఈ నిర్ణయం అమలులోకి వస్తే కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాస్త ఊరటఇచ్చినట్లే.