అక్షర ఆయుధం : రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ఎప్పుడు వెళ్లినా... మనసంతా భావోద్వేగంతో నిండిపోతుంది. రాజధాని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత నాపై ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అమరావతి చట్టబద్ధతకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేం’అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పట్టలేని ఆనందంలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల దీపహారతి కార్యక్రమానికి పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దీపహారతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి నుంచి దీపాలు వెలిగించి మద్దతు ప్రకటించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి పార్టీల కార్యాలయాల వద్ద కూడా దీపాలు వెలిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.అమరావతి ఆత్మగౌరవం గెలిచింది. పార్లమెంటు చట్టబద్ధతతో రాజధానికి నేడు తిరుగులేని శాసనం దక్కింది అని అభిప్రాయపడ్డారు. 1631 రోజుల రైతుల వీరోచిత పోరాటం విజయవంతం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు సందడి చేశారు.దీపహారతి ఇచ్చి పుణ్యభూమికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ సందర్భంగా నాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రైతులు చాలా మంది సీఎం చంద్రబాబు నాయుడును కలిసి నాటి సంగతులను గుర్తు చేశారు. ఉద్యమ శిబిరాల్లో రైతుల కన్నీళ్లు, ఉద్యమ ఘటనలు... 1,631 రోజుల రైతులు, మహిళల వీరోచిత పోరాటాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ఎప్పుడు వెళ్లినా... మనసంతా భావోద్వేగంతో నిండిపోతుంది. రాజధాని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత నాపై ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అమరావతి చట్టబద్ధతకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేం’అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు జాతి గౌరవం అమరావతి “అమరావతికి అపజయం లేదు... అన్ స్టాపబుల్. ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజా విజయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానికి ధన్యవాదాలు. హోం మంత్రి అమిత్ షా సహా కేంద్రం, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు సహకరించాయి. పవిత్రమైన మట్టి-నీటిని రాజధాని శంకుస్థాపన చేసిన రోజున ప్రధాని తెచ్చారు. పార్లమెంట్ వద్ద ఉన్న పవిత్ర మట్టిని... పవిత్ర యమునా నది జలాలతో పునీతమైన పుణ్యభూమి ఇది. దేశం మొత్తం అమరావతికి అండగా ఉంటుందని నాడే ప్రధాని మోదీ చెప్పారు. ఆదర్శ రాజధాని తెలుగు జాతి గుండె, జాతి గౌరవం అమరావతి. ఓ ప్రాజెక్టుకు రెండు సార్లు ప్రధాని రావడం అమరావతి పనుల విషయంలోనే జరిగింది. అమరావతి నిర్మాణాలు పూర్తి అయ్యాక మరోమారు ప్రధాని ప్రారంభోత్సవాలకు వస్తారు. ప్రపంచంలోని ప్రతీ అభివృద్ధి మోడల్ అమరావతికి తెస్తాను. అమరావతికి శాశ్వతత్వం తెచ్చినందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని ఎవరూ మార్చలేరు. ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు..ఇప్పుడు మనకు ఓ అడ్రస్ వచ్చింది. వివిధ ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించి.. నాడు శంకుస్థాపన చేశాం. ప్రధాని మోదీ తెచ్చిన పవిత్ర మట్టి-నీటితో పునీతమైన ఈ భూమిపై ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాం. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నా.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.అమరావతిని చంపాలనుకున్న పార్టీ పీడ విరగడవ్వాలి “ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి ఇవాళ అండగా నిలబడ్డాయి. అమరావతిని స్మశానం అన్నారు కానీ ఇవాళ పార్లమెంటులో అమరావతికి తిరుగులేని శాసనం చేసుకున్నాం. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు... అడ్రస్ లేకుండా పోయారు. అమరావతి విషయంలో ఇంత జరిగినా వైసీపీకి మాత్రం బుద్ది రాలేదు. వారి పిచ్చి ఇంకా ముదిరింది. అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై తీర్మానం పెడితే ఆ పార్టీ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. పార్లమెంటులో చట్టం చేస్తుంటే.. వాకౌట్ చేసింది. వాకౌట్ చేసిన ఆ పార్టీని ప్రజలు బ్లాక్ అవుట్ చేయాలి. అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదు. ఇంతటి నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదు. వైసీపీని అంతా మరిచిపోవాలి, రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలి. మావిగన్ అంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశారు. డిక్షనరిలో చూశాను నాకు అర్థం కాలేదు. వైసీపీవి అన్నీ బుద్ది లేని వ్యాఖ్యలు..దుర్మార్గపు ఆలోచనలే.”అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.