
జనం న్యూస్: ‘రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలి. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరపుకునే సమయమిది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతికి మద్దతుగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటి ముందుకు దీపాలు వెలిగించాలని ఆదేశించారు. ఎన్డీఏ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతీ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి అని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కేంద్రానికి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇకపోతే ఇవాళ మధ్యాహ్నం 2015లో రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండ రాయినిపాలెం వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు చీదరించుకున్న జగన్‌లో మార్పు రాలేదు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అమరావతి బిల్లు చట్టబద్దత కల్పించిన ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోంది. కేంద్ర సహకారంతో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతోంది. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టింది. అమరావతి మనకు ఒక సెంటిమెంట్. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు. అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట’అని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మావిగన్ అనే వింత పేరు తీసుకువచ్చిన జగన్. ‘అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. గతంలోనూ ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని పేరు ఉంటే ఎస్ఆర్ఎంగా మార్పించారు’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నాడు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్‌లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది. మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలి. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరగాలి. ‘రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలి. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరపుకునే సమయమిది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఉద్దండరాయునిపాలెం రాజధాని సంబరాల్లో పాల్గొంటా. ‘నేను మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెనికి వెళ్తున్నాను. రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నాను. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతం ఉద్దండరాయునిపాలెం’గా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ‘మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి కోరుకోవాలి. సంకల్పం తీసుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ‘మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ ఎన్డీఏ నేతలతో సమీక్షలో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్‌తీరును సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారు.గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని ఎగతాళిగా మాట్లాడారు అని మండిపడ్డారు. ‘ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చింది. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తాం. అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. బిల్లు ఆమోదం సంతోషమని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన విజయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అభివర్ణించారు. సాయంత్రం చేపట్టే కేంద్రానికి మద్ధతు తెలిపే కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ పాల్గొంటాయని తెలిపిన నాదెండ్ల మనోహర్, మాధవ్‌లు వెల్లడించారు.