
అక్షర ఆయుధం : బీహార్‌లోని నలంద జల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని మాఘ్రా ఉన్న శీతలామాత ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు.బీహార్‌లోని నలంద జల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని మాఘ్రా ఉన్న శీతలామాత ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు. పదులు సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో 8 మంది మరణించి ఉంటారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఆలయాన్ని మూసివేశారు.వివరాలు... మాఘ్రాలో ఉన్న శీతలామాత ఆలయం వద్దకు మంగళవారం ఉదయం భారీగా భక్తులు తరలివచ్చారు. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆలయం వద్ద వందలాది మంది భక్తులు ఉన్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే దీప్‌నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడకి చేరుకుని, గాయపడిన వారందరినీ తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి ఆలయం వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన పట్ల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రేమ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.ఆలయానికి వచ్చిన భక్తులలో ఒకరైన మమతా దేవి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... శీతలామాత దర్శనం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆలయం వద్ద ఎప్పుడూ రద్దీగా ఉంటుందని తెలిపారు. తాము కూడా దర్శనం కోసం పాట్నా నుండి వచ్చామని చెప్పారు. అయితే అక్కడ తొక్కిసలాట జరిగిందని... అందులో కొందరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇది నిర్వాహణ లోపం వల్లే జరిగిందని ఆరోపించారు. ఇక్కడికి ఒక అంబులెన్స్ చేరుకుందని... ఇక్కడ విపరీతమైన రద్దీ ఉందని, కానీ అధికారులు మాత్రం ఇక్కడ లేరని చెప్పారు.మరో భక్తురాలు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు... శీతలామాత ఆలయం వద్ద భారీ జనసమూహం ఉందని తెలిపారు. తాము నలుగురం పాట్నా నుండి వచ్చామని... తాము ఒకరి నుంచి ఒకరం విడిపోయామమని చెప్పారు. జనం ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి వద్ద ఉన్న వ్యక్తి మాట్లాడుతూ... ఆలయం వద్ద జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ అక్కడ విపరీతమైన రద్దీ ఉందని తెలిపారు. ఆలయం లోపలికి వెళ్లడానికి కూడా ప్రజలకు కనీస స్థలం కూడా లేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆలయం వద్దకు అంబులెన్స్ చాలా ఆలస్యంగా చేరుకుందని చెప్పారు.ఇక, ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ‘‘బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన అత్యంత బాధాకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.