
జనం న్యూస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఇదివరకే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఇదివరకే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరపోయినా ఇరాన్ హర్మూజ్ జలసంధించి తెరకపోయినా ఇరాన్‌లోని చమురు బావులు, విద్యుత్ కేంద్రాలు, ఖర్గ్ ద్వీపంతో సహా కీలక మౌలిక సదుపాయాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక జారీ చశారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టు చేశారు. ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఇరాన్‌లోని కొత్త ప్రభుత్వంతో అమెరికా చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ఈ చర్చల్లో పురోగతి ఉందని కూడా చెప్పారు. ‘‘ఇరాన్లో మా సైనిక కార్యకలాపాలను ముగించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక కొత్త, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరుపుతోంది’’ అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఈ చర్చల్లో గొప్ప పురోగతి సాధించాం అయితే ఏ కారణం చేతనైనా త్వరలో ఒప్పందం కుదరకపోయినా (బహుశా కుదురుతుంది), హర్మూజ్ జలసంధిని వెంటనే వ్యాపారం కోసం తెరవకపోయినా మేము ఇరాన్లో మా అందమైన బసను వారి అన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ ద్వీపాన్ని (మరియు బహుశా మేము ఉద్దేశపూర్వకంగా ఇంకా టచ్ చేయని అన్ని ఉప్పునీటి శుద్ధి కర్మాగారాలను కూడా!) పేల్చివేసి, పూర్తిగా నాశనం చేయడం ద్వారా ముగిస్తాము. పాత పాలకుల 47 ఏళ్ల భయానక పాలనలో ఇరాన్ మా సైనికులను ఇతరులను ఊచకోత కోసి చంపినందుకు ప్రతీకార చర్యగా ఇది ఉంటుంది’’ అని ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ క్రమంలోనే మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ తన నియంత్రణలో ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇంధన ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలోనే గత వారం ట్రంప్. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు 48 గంటల సమయం ఇస్తున్నామని, లేకపోతే ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.