తెలంగాణలోని ఆ గ్రామంపై ప్రధాని మోదీ ప్రశంసలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రెడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో పలు అంశాలను ప్రస్తావిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణలోని ఓ గ్రామంపై ప్రశంసలు కురిపించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రెడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో పలు అంశాలను ప్రస్తావిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్‌లో తెలంగాణలోని ఓ గ్రామంపై ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రధాని మోదీ తన మన్ కీ బాత్‌లో వేసవి కాలంలో నీటి సంరక్షణ గురించి ప్రస్తావించారు. దేశంలోని అనేక ప్రాంతాలలో వేసవి ప్రారంభమైందిని... ఈ సందర్భంగా నీటి సంరక్షణ పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గత 11 సంవత్సరాలుగా, 'జల్ సంచయ్ అభియాన్' ప్రజలలో ఎంతో అవగాహన కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల కృత్రిమ నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఇందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. కొన్ని చోట్ల పాత చెరువులను శుభ్రం చేస్తున్నారని... మరికొన్ని చోట్ల వర్షపు నీటిని సంరక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పర్కొన్నారు. అమృత్ సరోవర్ అభియాన్ కింద కూడా... దేశవ్యాప్తంగా దాదాపు 70,000 అమృత్ సరోవర్లు నిర్మించారని తెలిపారు. వర్షాకాలం రాకముందే ఈ సరస్సులను శుభ్రపరిచే పని కూడా ప్రారంభమైందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నీటి సంరక్షణ పాటిస్తున్న కొన్ని గ్రామాల ఉదాహరణల కూడా మోదీ ప్రస్తావిం చారు. అందులో తెలంగాణలోని ముదిగుంట గ్రామం కూడా ఉంది. ప్రధాని మోదీ ఈరోజు తన మన్‌ కీ బాత్‌లో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ ప్రజల సామూహిక కృషిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలోని 400 కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి, తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారని ప్రశంసించారు. ఈ బృహత్తర చర్య వల్ల గ్రామంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అలాగే కలుషిత నీరు లేకుండా పోయి, వ్యాధులు కూడా తగ్గాయని పేర్కొన్నారు.ఇక, మన్ కీ బాత్ కోసం ప్రతి నెలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో సందేశాలు అందుతున్నాయని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఈ సందేశాల వల్ల సుదూర ప్రాంతాల్లోని ప్రజలు ఎంత ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని వింటారో త‌న‌కు తెలుస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌ ఆలోచనలు, అనుభవాలు ఈ కార్యక్రమాన్ని నిరంతరం మెరుగ్గా రూపొందించ‌డానికి ప్రేరణను ఇస్తాయని మోదీ తెలిపారు. ప్రేరణాత్మకమైన అంశాల‌ను మ‌న్‌కీబాత్ కోసం ఇలానే పంచుకోవాల‌ని కోరారు. ఒక‌రి చిన్న ప్రయత్నం మరొకరి జీవితంలో పెద్ద మార్పుని తేవ‌చ్చ‌ని తెలిపారు.