అసెంబ్లీలో క్రమశిక్షణ చర్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

జనం న్యూస్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రోజున తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గన్‌పార్క్‌ వద్ద కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో జరిగిన 20 స్కామ్‌లు జరిగాయని ఆరోపించిన బీఆర్ఎస్ శాసనసభ పక్షం. వాటిపై విచారణ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు ఉదయం నుంచే సభలో ఆందోళన కొనసాగించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద వెళ్లేందుకు యత్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అయితే సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర దుమార రేపింది. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ చేశారు. అలాగే, కౌశిక్ రెడ్డిని సభలో నుంచి సస్పెండ్ చేయాలంటున్న పలువురు మంత్రులు సైతం కోరారు. మరొవైపు బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ శాసనసభలోకి కొత్తగా అడుగుపెట్టిన సభ్యులకు బీఆర్ఎస్ ఎలాంటి సంస్కృతిని నేర్పిస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల సభా సమయం వృథా అవుతోందని అన్నారు. కడియం శ్రీహరిని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం బీఆర్ఎస్ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను జరగనివ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దని, బడ్జెట్‌పై చర్చ జరగొద్దని, వారికి తప్ప ఎవరికీ మేలు జరగొద్దనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పవిత్రమైన సభా సంప్రదాయాలను పాటించాలని కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్టీ ఫిరాయించినవారు, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోటి పది లక్షల రూపాయల జీతం తీసుకుని సభకు రావడం లేదని ముందు ఆయనతో రాజీనామా చేయించాని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేయించారు. ప్రభుత్వం బీఆర్ఎస్ చెప్పినట్టుగా వినాలా? ప్రశ్నించారు. బీఆర్ఎస్ చెప్పినట్టుగా వినకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. మీ (బీఆర్ఎస్) తాతలు దిగొచ్చిన మంత్రి పొంగులేటి రాజీనామా చేయరని అన్నారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న కడియం శ్రీహరి కేసీఆర్‌కు సరిసమానమైన ప్రజాప్రతినిధి అని పేర్కొన్నారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తనను కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సభ్యులు సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజులు సస్పెండ్ చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం సభ నియమాలను ఉల్లంఘించిన కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని అన్నారు. ఈ క్రమంలోనే సభా కార్యక్రమాలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని, వారిని సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు ఈరోజు ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు తన తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వందల ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని, ప్రైవేటు కంపెనీలను బెదిరించి ఈ భూములను బదలాయించుకున్నారని ఆరోపించారు. దీనిపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ ‌రావు నిజాయితీపరుడైతే హౌస్ కమిటీ ఏర్పాటుకు అంగీకరించి, అందుకు సహకరించాలని రేవంత్ సవాల్ విసిరారు.