
జనం న్యూస్: ‘ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది’అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు.‘బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి’అని సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పోలీస్ విధుల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటూనే ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. సైబర్ క్రైమ్ మోసాల బారినపడకుండా అనేక జాగ్రత్తలు చెప్తుంటారు.అంతేకాదు అనవసరపు లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తుంటారు. అంతేకాదు పండుగలను క్యాష్ చేసుకునేలా సైబర్ కేటుగాళ్లు పంపించే లింక్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు వీసీ సజ్జనార్. తాజాగా వీసీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేస్తూ ఓ వీడియోషేర్ చేశారు.ఇటీవలే డేటింగ్ యాప్‌లపై ప్రజలను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్ తాజాగా మరో కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ సీజన్ రావడంతో యువత బెట్టింగ్ ఊబిలో పడొద్దు అని సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కోరారు. ఐపీఎల్ సీజన్ మెుదలవ్వడంతో అలర్ట్. ‘ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’అని యువతకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్‌కు పాల్పడితే ఫిర్యాదు చేయండి. ‘ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది’అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు.‘బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి’అని సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.