
జనం న్యూస్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. పనులు చేసి చూపించే నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. పనులు చేసి చూపించే నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్దం కొనసాగుతున్న వేళ భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకారం ‘‘భారతదేశంతో మన అద్భుతమైన సంబంధం భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ప్రధానమంత్రి మోదీ, నేను పనులు చేసి చూపించే వ్యక్తులం. ఇది చాలా తక్కువ మంది విషయంలో మాత్రమే సాధ్యమవుతుంది’’ అని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్‌లు ఫోన్ ద్వారా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇరువురు నేతలు ప్రధానంగా ఇరాన్ యుద్దం గురించి కూడా చర్చించారు. అయితే ట్రంప్‌తో ఫోన్ కాల్ అనంతరం పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణపై, ప్రపంచ వాణిజ్యానికి హర్మూజ్ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యతపై భారతదేశ వైఖరిని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియాలోని పరిస్థితిపై మేమిద్దరం చర్చించాం. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుంది. హర్మూజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా, అందుబాటులో ఉంచడం ప్రపంచం మొత్తానికి అత్యవసరం. శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని మేమిద్దరం అంగీకరించాం’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ట్రంప్, మోదీలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతపై చర్చించారు. వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా, అందుబాటులో ఉంచడం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఎందుకంటే. ప్రపంచ చమురు సరఫరాకు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిలో వందలాది నౌకలు చిక్కుకుపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఇరాన్ హర్ముజ్ జలసంధి కేవలం తమ శత్రువులైన అమెరికా, దాని మిత్రదేశాల కోసం మాత్రమే మూసివేయబడిందని తెలిపింది.