మార్కాపురంలో బస్సు ప్రమాదం కలకలం

రెక్కాడితే గానీ డొక్కాడని వారే మృతి

జనం న్యూస్: మార్కాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాధితులు అంతా రెక్కాడితేగానీ డొక్కాడని వాళ్లేనని తెలుస్తోంది.బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రంలో సుతారీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్న వాళ్లేనని తెలుస్తోంది. పనిముగించుకుని మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనుకుంటుండగా ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎవరిని కదిలించినా కన్నీటి కథనాలే. రెక్కాడితే గాని డొక్కాడని వారంతా మరికొద్ది సమయంలో ఇంటికి చేరకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 13 మంది విగతజీవులుకాగా మరికొందరు ఆస్పత్రుల్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు సుతారీలు, కార్మికులు తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల, కోర్టులలో వచ్చి గృహనిర్మాణ పనుల్లో పాల్గొంటారు. పనుల నిమిత్తం ఉదయం తీసుకురాగా రాత్రి మళ్లీ తిరిగి తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. మృతులంతా రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లే మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారిగా తెలుస్తోంది. మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుతారీలు, కార్మికులు తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల, కోరుట్లలో రోజూవారీగా పనిచేస్తుంటారు. ఏపీ నుంచి వీరిని హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల, కోరుట్ల తీసుకెళ్తుంది.మళ్లీ పని అయిపోయిన తర్వాత తిరిగి తీసుకువస్తుంది. బతుకుదెరువు కోసం వీరంతా పొరుగు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో పనులు ముగించుకోగా జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్‌లో వీరంతా బయలు దేరారు. ఇలా వస్తుండగా రాయవరం సమీపంలో క్వారీల వద్ద టిప్పర్‌ను ఢీ కొట్టింది.ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉండగా, మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిలో కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు కండీషన్‌ సరిగా లేదని చెప్పిన ప్రయాణికులు. ఇదిలా ఉంటే జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరేటప్పుడు కండీషన్ సరిగా లేదని డ్రైవర్‌తో ప్రయాణికులు చెప్పినట్లు తెలుస్తోంది.ప్రయాణికులు డ్రైవర్‌కు ముందుగానే చెప్పడంతో యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత బస్సు తిరిగి బయలుదేరింది. డ్రైవర్‌తోపాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే ఇంతమంది బలి అయ్యేవారు కాదు అని స్థానికులు అంటున్నారు.