
పయనించే సూర్యుడు న్యూస్ : విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అరెస్ట్ చేయగా హైదరాబాద్ చంచల్‌గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సయీదా బేగంను హైదరాబాద్ నుంచి విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో మరోకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ చంచల్‌గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సయీదా బేగంను హైదరాబాద్ నుంచి విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఫారిన్ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్‌లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడంలో సయీదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సయిదా బేగం అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలో అలజడి సృష్టించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవంతంగా భగ్నం చేశారు. విజయవాడ కేంద్రంగా సాగుతున్నఈ ఉగ్ర నెట్ వర్క్‌ను ఛేదించారు. అంతేకాదు ఈ ఉగ్ర నెట్ వర్క్‌తో లింకులు ఉన్నవారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా హైదరాబాద్‌లో ఒక మహిళను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో సయిదా బేగం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టా వేదికగా నెట్ వర్క్ విస్తరించేందుకు ప్లాన్ మరోవైపు విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.ఉగ్ర లింకుల నేపథ్యంలో 2025 జూన్‌లో గుజరాత్లో ముగ్గురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారంతా అలర్ట్ అయ్యారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 12 మంది కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీరు ఏపీ, తెలంగాణతో పాటు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించేందుకు ప్లాన్ చేశారు. పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి వీరికి ఆర్థిక సహాయం అందుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బీహార్ వాసి దిల్కాష్తో పాటు మిగిలిన సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులపై UAPA చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం దీనిని త్వరలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఉగ్రలింకులు ఏపీలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించడం కలకలం రేపింది. విజయవాడలో ఉగ్రవాద మూలాలు బయటపడటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడలోని పాతబస్తి(వించ్‌పేట) పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ముగ్గురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహ్మద్ డానిష్‌లు ఉన్నారు. ఈ ముగ్గురు యువకులు మూడంతస్తుల భవనంలో నివశిస్తూ సోషల్ మీడియా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పక్కా సమాచారం ఉంది. ఈ పక్కా సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వారు ఉంటున్న ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు.కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహ్మద్ డానిష్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఐసిస్ (ISIS), అల్ ఖైదా (AQIS) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అంతేకాదు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు వీరు ఇన్‌స్టా, టెలిగ్రామ్ వంటి యాప్‌లలో ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసి, రెచ్చగొట్టే వీడియోలు, పోస్టులను షేర్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు, పోస్టులను షేర్ చేయడమే కాకుండా విదేశాల్లోని ఉగ్రవాద హ్యాండ్లర్లతో వీరు నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఏప్రిల్ 6 వరకు రిమాండ్ ఇకపోతే ఉగ్ర లింకులతో అరెస్ట్ అయిన మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్‌లను విజయవాడ సీఎంఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో వీరికి న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇకపోతే కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదిని నియమించుకున్నారా? అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించగా తాము నియమించుకోలేము అని తెలియజేశారు. అయితే రాతపూర్వకంగా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.