మోదీ ముందుచూపు

ఆఫ్రికా నుంచి చౌకగా గ్యాస్ దిగుమతి నిర్ణయం

అక్షర ఆయుధం : కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రారంభించింది. భారతదేశ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ విదేశ్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముడి చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీయడంలో ముందడుగు వేస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఆఫ్రికా ఖండంలో సైతం ఓఎన్జీసీ విదేశ్ విరివిగా కార్యకలాపాలను చేపట్టింది. అందులో అత్యంత కీలకమైనది మొజాంబిక్ దేశంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.భారతదేశం తన ఇంధన అవసరాల కోసం విదేశాల పైన ఎక్కువగా ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో క్రూడ్ ఆయిల్ అలాగే సహజవాయు నిక్షేపాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్, సహజవాయువులను దిగుమతి చేసుకుంటుంది. మన దేశీయ అవసరాలలో దాదాపు 90% విదేశాల నుంచి దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్, సహజవాయువులే మన ఇంధన అవసరాలను తీర్చుతున్నాయి. సుమారు 40 దేశాల నుంచి మన దేశం క్రూడ్ ఆయిల్, సహజవాయువులను దిగుమతి చేసుకుంటున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో ఇంధన కొరత అనేది ఏర్పడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ సరఫరా చేసే నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఫలితంగా మన దేశీయంగా గమనించినట్లయితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో పాటు తీవ్రమైన కొరత కూడా ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లభించకపోవడంతో హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆహార సంబంధిత ఇండస్ట్రీ మొత్తం దాదాపు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొజాంబిక్ గ్యాస్ ప్రాజెక్టుతో భారత్ కష్టాలు గట్టెక్కే ఛాన్స్ అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రారంభించింది. భారతదేశ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ విదేశ్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముడి చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీయడంలో ముందడుగు వేస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఆఫ్రికా ఖండంలో సైతం ఓఎన్జీసీ విదేశ్ విరివిగా కార్యకలాపాలను చేపట్టింది. అందులో అత్యంత కీలకమైనది మొజాంబిక్ దేశంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఓఎన్జీసీ విదేశ్ మొజాంబిక్ తీరంలో ఉన్నటువంటి రోవుమా ఏరియా-1లో గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టింది. ఈ ప్రాంతంలో సుమారు 75 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో వాటా సుమారు 16%గా ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి నౌకల ద్వారా నేరుగా భారతదేశంలోని తూర్పు తీరానికి తరలించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే కొన్ని భద్రతా కారణాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రవాద కార్యకలాపాలతో పూర్తిగా పనులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.ప్రధాని మోదీ చొరవతో తిరిగి ప్రారంభమైన మొజాంబిక్ గ్యాస్ ప్రాజెక్ట్ :మొజాంబిక్ గ్యాస్ ప్రాజెక్ట్ 2021లో ఆ దేశంలో ఏర్పడిన ఉగ్రవాద అస్థిరత వల్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన చొరవ తీసుకొని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో పనిచేశారని చెప్పవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ మొజాంబిక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో పాటు ఆ ప్రాంతంలో ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం మొజాంబిక్ దేశానికి రక్షణ సంబంధిత సహకారాన్ని సైతం పెద్ద మొత్తంలో అందించింది. అలాగే G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యురాలిగా చేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. దీంతో మొజాంబిక్-భారత్ మధ్య సంబంధాలు బలపడ్డాయి.ప్రధాని నరేంద్ర మోదీ చొరవ కారణంగానే ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ 2025 నవంబర్ 12 నుంచి మొజాంబిక్ గ్యాస్ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించింది. అటు భారత ప్రభుత్వం కూడా ఓఎన్జీసీ బోర్డుకు అదనంగా 5000 కోట్ల రూపాయలు కేటాయించడంతో మొజాంబిక్ తీరంలో గ్యాస్ వెలికితీత కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 2026 జనవరి 29వ తేదీన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో మొజాంబిక్ గ్యాస్ వెలికితీత పనులు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ 4,000 మంది కార్మికులు గ్యాస్ వెలికితీత పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 2029 నాటికి ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొజాంబిక్ గ్యాస్ ప్రాజెక్టు వల్ల లాభాలు ఇవే:ఈ ప్రాజెక్టు గనుక సక్సెస్ అయినట్లయితే మొజాంబిక్, ఆఫ్రికా తూర్పు తీరం నుంచి మన దేశంలోని పశ్చిమ తీరంలోని గుజరాత్, మహారాష్ట్రకు గ్యాస్ తరలించడం అనేది చాలా సులభతరం అవుతుంది. అలాగే మొజాంబిక్ గ్యాస్ వెలికితీతలో ఓఎన్జీసీ విదేశ్‌కు 16% వాటా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ గ్యాస్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరకే భారతదేశానికి గ్యాస్ లభించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మొజాంబిక్ దేశంలో ఉగ్రవాద సమస్య తలెత్తకుండా ఆ దేశ ప్రభుత్వానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు కూడా భారత ప్రభుత్వం హామీ అందించింది. అలాగే సముద్రం నుంచి వెలికి తీసిన గ్యాస్‌ను ద్రవ రూపంలో మార్చేందుకు భవిష్యత్తులో ఒక భారీ లిక్విఫికేషన్ ప్లాంట్‌ను నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయినట్లయితే భారతదేశ భవిష్యత్తులో గ్యాస్ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.