
పయనించే సూర్యుడు న్యూస్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రభావం భారత్‌పై చూపిస్తోంది అని లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుంది అని తెలిపారు. ఈ యుద్ధం పలు దేశాలల్లోని వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై చూపుతోంది అని అన్నారు. యుద్ధం ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ మేరకు పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో ప్రధాని స్టేట్‌మెంట్ ఇచ్చారు.‘ఈ యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది.భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారు. భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.‘భారతీయుల కోసం హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 3 లక్షల 75 వేలమందిని సురక్షితంగా భారత్‌కు తరలించాం. ఇరాన్ నుంచి 1000 మందిని తరలించాం’అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పెట్రోల్ గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం ప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. 60 శాతం LPGని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నాం అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ‘53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్ ఆదా అవుతుంది. ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉంది. భారత్‌పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నాం’అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి నా వంతు కృషి చేస్తున్నా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం అని చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తాం అని హామీ ఇచ్చారు.పవర్‌ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి అని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు పశ్చిమాసియాదేశాధ్యక్షులతో మాట్లాడుతున్నా... యుద్ధాన్ని ఆపడానికి తన వంతు కృషి చేస్తున్నాను అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నాం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోందని...ఈ యుద్ధం గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై, దేశ వాణిజ్యంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇప్పటికే సభకు వివరించారని గుర్తుచేశారు. ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని వెల్లడించారు. భారత్‌కు అవసరమైన ముడిచమురు, గ్యాస్, ఎరువులు వంటివి పెద్ద మొత్తంలో హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు సవాలుగా మారాయని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడకుండా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది అని ప్రధాని మోడీ వివరించారు. 41 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి దేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వినియోగదారులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అదే సమయంలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. గత 11 ఏళ్లలో ఇంధన భద్రత కోసం తమ ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యలను ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో ప్రస్తావించారు. గతంలో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్‌జీ, ఎల్పీజీ వంటివి దిగుమతి చేసుకోగా... నేడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి చేరామని చెప్పుకొచ్చారు. సంక్షోభ సమయాల కోసం ముడి చమురు నిల్వలకు ప్రాధాన్యత ఇచ్చామని...ప్రస్తుతం దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని 64 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెంచేందుకు పనులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం పశ్చిమాసియాలో యుద్ధం వల్ల నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభం భారత్‌కు ఆర్థిక, జాతీయ భద్రత, మానవతా పరమైన సవాళ్లను సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.‘యుద్ధంలో చిక్కుకున్న దేశాలతో, దాని ప్రభావానికి గురైన దేశాలతో భారత్‌కు విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మనకు అవసరమైన ముడి చమురు, గ్యాస్‌లో సింహభాగం ఈ ప్రాంతం నుంచే దిగుమతి అవుతోంది. ఇతర దేశాలతో మన వాణిజ్యానికి ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన మార్గం కూడా. అందువల్ల, ఈ యుద్ధం మనపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం పశ్చిమాసియాలోని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ‘యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత దేశాల్లోని ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం. నేను స్వయంగా రెండు దఫాలుగా చాలా పశ్చిమాసియా దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడాను. భారతీయులకు పూర్తి భద్రత కల్పిస్తామని వారంతా హామీ ఇచ్చారు’అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.ఈ యుద్ధం వల్ల దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని చెబుతూ, వారి కుటుంబాలకు అవసరమైన మద్దతు అందిస్తున్నామని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పటికే 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని....ఒక్క ఇరాన్ నుంచే 700 మంది మెడికల్ విద్యార్థులతో సహా వెయ్యి మంది వచ్చారని చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలల్లో 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిందని, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని లోక్‌సభలో ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు.