గ్రూప్-1 అభ్యర్థులకు హైడ్రా కమిషనర్ మార్గదర్శకాలు

జనం న్యూస్: ‘ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ - 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీనే మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి’ అని గ్రూప్‌-1కు ఎంపికైన వారికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. ‘స‌మాజ ప్ర‌యోజ‌నాలు కోరి మంచి చ‌ట్టాలు రూపొందించుకున్నాం. పేప‌రు మీద అన్నీ ఉంటాయి.. కాని వాటిని అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌యోజ‌నం లేద‌ు’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. గ్రూప్ -1 కేడ‌ర్‌కు ఎంపికైన ఉద్యోగుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా డా. మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. హైడ్రా కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు. ‘ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ - 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీరే మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి’ అని గ్రూప్‌-1కు ఎంపికైన వారికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. గ్రూప్-1 ఎంపికైన వారితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ‘ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ - 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీరే మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి’అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆకాంక్షించారు. ‘మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి. మీ విభాగాల్లో ఎవ‌రికి వారు కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాలి ’అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. ఆదిలో హైడ్రా ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను వాటిని అధిగ‌మించిన తీరును తెలిపారు. హైడ్రా అంటే ప్ర‌జ‌ల్లో పూర్తిగా అవ‌గాహ‌న రావ‌డంతో తాము చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తి స్థాయి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంద‌ని అన్నారు. ‘సామాజిక మాధ్య‌మాల్లో గ‌మ‌నిస్తే.. హైడ్రా అంటే ఆదిలో దాదాపు 70 శాతం నెగిటివిటీ క‌నిపించేది. ఇప్పుడా శాతం రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. 85 శాతం మంది హైడ్రా ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్నార‌న్నారు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మ‌న కార్య‌క‌లాపాలు సాగించ‌డం. గ్రౌండ్‌మీద ఫ‌లితాలు చూపించ‌డంతో సాధ్య‌మైంది’అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అ‌న్నారు.