
అక్షర ఆయుధం : కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్ట వశాత్తు.. ఆకస్మికంగా దూరమైతే.. ఆ కుటుంబం వీధిన పడకుండా భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, మధ్య తరగతి అనే వ్యత్యాసం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయ బోతున్నామని... కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా భద్రత, భరోసా లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబంపడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బృహత్తరమైన పథకానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.1.15కోట్ల కుటుంబాలకు జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ప్రకారం అర్హులైన కుటుంబంలో ఇంటి పెద్దను కోల్పోతే వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయింపులు చేసినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం… అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది... సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి... ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నామో అనే దానిపైనా ఆర్థికశాఖ మంత్రి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించేశారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇది వరం అని.. తెలంగాణలో పుట్టటం.. జీవించటం అనేది వరం అనే విధంగా ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా.. ప్రభుత్వం భద్రత కల్పించటానే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.