ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలో గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని... మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని... మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోంది అని తెలిపారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్‌తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలోని ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి ఎల్పీజీ కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలి అని సూచించారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలి అని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ విస్తరించాలి గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలి అని సూచించారు. ఏపీలోని కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలి అని కోరారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.