రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

★ తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం

జనం న్యూస్ :  తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 22న రైతు భరోసా మెుదటి విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏప్రిల్ నెలాఖరులోపు మూడు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో రూ.9వేల కోట్లు నగదు రైతుల ఖాతాలో జమకానున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాతలు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. మార్చి 22న రైతు భ‌రోసా మొద‌టి విడ‌త నిధులు విడుద‌ల‌ చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి రైతు భ‌రోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌పై ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, అధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడ‌త‌గా మొత్తం 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎక‌రం వ‌ర‌కు రైతు భ‌రోసా కింద రూ.3,590 కోట్లు బ‌దిలీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నర్మెట్టలో రైతు భరోసా నిధులు విడుదల అన్న‌దాత‌ల‌కు శుభ‌వార్త వెలువ‌డింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆదివారం చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎక‌రం వ‌ర‌కు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ‌దిలీ చేయ‌నున్నారు. త‌ర్వాత మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగ‌తా నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి సురేంద్ర మోహ‌న్‌ పాల్గొన్నారు. 70 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా పథకం కింద మొదటి విడత నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో నగదు జమ అలాగే రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుచెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దశల వారీగా నిధుల పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.అదే విధంగా ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రైతు భరోసా నిధులను విడుదల చేసి మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మూడు విడతలుగా కలిపి రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు చేరనున్నాయని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.రైతు భరోసా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి రాష్ట్ర రైతాంగం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.