
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. టవర్ -1 కు మొదటి స్టీల్ డయాగ్రిడ్‌ను అమర్చే పనులను మంత్రి నారాయణ సోమవారం ప్రారంభించారు. అమరావతిలో డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ భవనాలును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టవర్ 1కు డయాగ్రిడ్ అమర్చే పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే అమరావతిలో భవన నిర్మాణాలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. అమరావతిలో జీఏడీ,హెచ్‌వోడీలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో, మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో 5 టవర్లు నిర్మాణం చేయనున్నట్టుగా తెలిపారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం ప్లాన్ చేశామని వివరించారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేశామని తెలిపారు. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక, అమరావతిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రైతులఅమరజీవికి కూటమి ప్రభుత్వం ఘన నివాళి. మంత్రి నారాయణ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన 'అమరజీవి' శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125 జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు నారాయణ ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఆయన త్యాగం నిరుపమానం, ఆయన జీవితం తెలుగు ప్రజలకు స్ఫూర్తిదాయకమని అని పేర్కొన్నారు. నేడు రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైన ఆయన విగ్రహావిష్కరణ అందరికీ గర్వకారణమని అన్నారు.కు మాట ఇచ్చిన విధంగా అమరావతి రాజధాని నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.