4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఎన్నికలు

మే 4న ఓట్ల లెక్కింపు : పూర్తి షెడ్యూల్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం (మార్చి 15) రోజున నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం (మార్చి 15) రోజున నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్... అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల నామినేషన్ దాఖలు, నామినేషన్ ఉపసంహరణ, పోలింగ్, ఎన్నికల ఫలితాల తేదీలను ప్రకటించారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఇక, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్... మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలు నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ... మార్చి 16 కేరళ అసెంబ్లీ... . తమిళనాడు అసెంబ్లీ... తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 మంది సభ్యులు ఉన్నారు. తమళనాడులో ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 10న ముగియనుంది. ఇక్కడ అంతకు ముందే ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్‌ కూటమికి అన్నాడీఎంకే-బీజేపీలతో ఎన్డీయే కూటమికి మధ్య ప్రదాన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది కూడా చూడాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ... పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 మంది సభ్యులు ఉన్నారు. బెంగాల్‌లోని ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో అంతకంటే ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య హోరా హోరీ పోరు జరగవచ్చని భావిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏ మేరకు సీట్లు సాధిస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. టీఎంసీ వర్సెస్ బీజేపీ‌గా కొనసాగుతున్న పరిణామాల వేళ... బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. పుదుచ్చేరి అసెంబ్లీ... కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరిలో ప్రస్తుత శాసనసభ పదవీకాలం జూన్ 15తో ముగియనుంది. దీంతో అంతకంటే ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అక్కడ ఎన్డీయే, ఇండి కూటమిల మధ్య పోటీ నెలకొనుంది.