తెలంగాణలో గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ స్పష్టం

జనం న్యూస్ : తెలంగాణలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు గందరగోళం చెందుతున్న వేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర సచివాయలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు,పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారిగా 72 శాతం బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు,విద్యాసంస్థలకు,వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని తెలిపారు. అటువంటి వారిపై కఠినమైన చర్యలకు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాజా పరిస్థితుల వేళ అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్‌పీజీ బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని చెప్పారు.