ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం

★ జస్టిస్ లీసా గిల్ ఒక్క రోజులో 3 వేల కేసులకు తీర్పు

జనం న్యూస్ : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లిసా గిల్‌తో ప్రస్తుత సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణ స్వీకారం వేయించారు.ధీరజ్ సింగ్ ఠాకూర్ రిటైర్మెంట్ తర్వాత ఏపీ హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ఉదయం 10.15 నిమిషాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్...ప్రస్తుతం ఏపీ హైకోర్టులో రెండో అత్యున్నత స్థానంలో కొనసాగుతారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నూతన విధానపరమైన నిర్ణయం ప్రకారం కాబోయే సీజే కోర్టు వ్యవహారాలపై ముందే అవగాహన పెంచుకోవడానికి వీలుగా రెండు నెలల ముందే బదిలీ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జస్టిస్ ఠాకూర్ రిటైర్మెంట్ తర్వాత జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిచారు.ప్రస్తుతం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లీసా గిల్ ఏఫ్రిల్ 24 తర్వాత సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో ముఖ్యమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. న్యాయ పరిపాలనలో సామర్థ్యాన్ని, నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి చీఫ్‌ జస్టిస్(సీజే) కాబోయే న్యాయమూర్తిని ఆ పదవికి ఖాళీ ఏర్పడడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.ఈక్రమంలోనే న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లీసాగిల్‌కు ఘన స్వాగతం అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌కు విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ లీసాగిల్‌కు గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు న్యాయమూర్తులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ లీసా గిల్‌ రోడ్డు మార్గాన అమరావతి వెళ్లారు. ఒకే రోజు 3వేల కేసులు పరిష్కరించిన జస్టిస్ లీసా గిల్ ఇకపోతే జస్టిస్ లీసా గిల్ చండీగఢ్‌లోని రాస్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యనిర్వాహక చైర్‌పర్సన్‌గా పనిచేశారు.డిసెంబర్ 2024లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ఒకే రోజులో దాదాపు 3,000 కేసులను పరిష్కరించారు. జస్టిస్ లీసా గిల్ సింగిల్ మరియు డివిజన్ బెంచ్‌లకు అధ్యక్షత వహించి క్రిమినల్, ఫ్యామిలీ మరియు సర్వీస్ లా అంతటా తీర్పులు వెలువరించింది. జనవరి 2026లో జస్టిస్ గిల్ మరియు జస్టిస్ మీనాక్షి ఐ మెహతాలతో కూడిన డివిజన్ బెంచ్ 2014 హత్య కేసులో రోహ్తక్ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే జస్టిస్ గిల్ 16 నవంబర్ 2028న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లీసా గిల్ నేపథ్యం ఇకపోతే జస్టిస్‌ లీసాగిల్‌ ఛండీగఢ్‌లోని కార్మెల్‌ కాన్వెంట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం జీసీజీ కళాశాల నుంచి హ్యుమానిటీస్‌లో పట్టభద్రులయ్యారు.ఆ తర్వాత పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. అనంతరం పంజాబ్‌, హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. క్రిమినల్‌, సివిల్‌, సర్వీస్‌, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో దిట్ట. ఛండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా జిస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు.