
సాక్షి డిజిటల్ న్యూస్ : హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి ఓ నౌక ఇండియాకు చేరుకుంది. ముంబై పోర్ట్‌కు ఆ చమురు ట్యాంకర్ వచ్చింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. అయితే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ చమురు ట్యాంకర్ హర్మూజ్ జలసంధిని దాటి ఇండియాకు చేరుకుంది. ముంబై పోర్ట్‌కు ఆ చమురు ట్యాంకర్ వచ్చేసింది. నౌకను హర్మూజ్ జలసంధిని దాటించిన భారత కెప్టెన్ సౌదీ అరేబియా ముడి చమురును రవాణా చేస్తున్న లైబీరియన్ జెండాను పెట్టుకుని ట్యాంకర్‌ను భారత కెప్టెన్ హర్మూజ్ జలసంధిని దాటించాడు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ దేశంపై దాడి చేసినప్పటి నుండి ఆ మార్గంలో జలసంధి గుండా రవాణా నిలిచిపోయింది.ఉద్రిక్త వాతారణణం ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని రెండు రోజుల క్రితమే దాటించి ఓ భారత కెప్టెన్ ముడి చమురు ట్యాంకర్‌ను ముంబై పోర్టుకు తీసుకువచ్చాడు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, లైబీరియా జెండా కలిగిన షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్, మార్చి 1న సౌదీ ఓడరేవు రాస్ తనురా నుండి ముడి చమురును లోడ్ చేసుకుని రెండు రోజుల తర్వాత బయలుదేరింది. సముద్ర డేటా సంస్థలైన ల్యోడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ , ట్యాంకర్‌ట్రాకర్స్ ప్రకారం, దాని చివరి సిగ్నల్ స్థానం మార్చి 8న హర్మూజ్ జలసంధి లోపల ఉంది. ఇండియన్ కెప్టెన్ నాయకత్వంలో రెండు రోజుల క్రితం హార్ముజ్ జలసంధిని క్లియర్ చేసి ముంబై ఓడరేవులో నిలిచింది, అమెరికా , ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుండి ఆ మార్గంలో సముద్ర రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో జలమార్గం ద్వారా సురక్షితంగా రవాణా చేసిన భారతదేశం మొదటి నౌకగా నిలిచింది. బుధవారం మధ్యాహనం ఒంటి గంట సమంయలో ముంబై పోర్టుకు చేరుకుందని అధికారులు తెలిపారు. యుద్ధం నేపథ్యంలో చైనా వైపు వెళ్లే జలమార్గాలను తప్ప, హర్మూజ్ జలసంధిలో ఇతర మార్గాల ద్వారా చమురు సరఫరాను అనుమతించబోమని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ప్రంపచ వాణిజ్యంలో ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గం తాత్కాలికంగా మూతపడింది. ప్రపంచంలోని ముడి చమురులో దాదాపు ఐదవ వంతు ఈ మార్గం ద్వారానే వెళుతుంది. అంతకుముందు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చెందన నౌకలు ప్రయాణించడానికి మార్గం సుగమం అయ్యింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్‌లో కోరారు.