వైఎస్సార్ కాంగ్రెస్ శక్తి రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు : వైఎస్ జగన్

జనం న్యూస్: ఓటీటీలో ప్రపంచ లీడర్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌కు వచ్చేసింది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. నెట్ ఫ్లిక్స్ వచ్చింది అంటే హాలీవుడ్ కూడా హైదరాబాద్‌కు వచ్చినట్టే అని సీఎం అన్నారు.ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ కూడా రావాలని మొదటి నుంచి బలంగా కాంక్షిస్తున్నట్లు తెలిపారు. ‘నెట్‌ఫ్లిక్స్‌ విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.‘ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం కూడా ఈ మహానగరం నుంచి కొనసాగించాలి’ అని సీఎం అభిలషించారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఐలైన్ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు ఈ స్టూడియో వేదిక కానుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చేసింది. ‘ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ తరుణం వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సరిపడా పరిమాణంలో నెట్‌ఫ్లిక్స్ విస్తరణ కోసం స్థలం కేటాయిస్తాం. అవసరమైతే నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు రిలొకేట్ చేయాలి’అని సీఎం రేవంత్ రెడ్డి రిక్వస్ట్ చేశారు. ‘ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నోకలర్, అక్కడి నుంచి ఈస్ట్‌మన్ కలర్, తర్వాత 70 ఎంఎం, డాల్బీ, అక్కడి నుంచి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ కూడా రావాలని మొదటి నుంచి బలంగా కాంక్షిస్తున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్‌వేలు. ‘ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటు కావాలన్నది మా ఆకాంక్ష. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది’అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘నెట్‌ఫ్లిక్స్ ప్రపంచానికి వినోదం అందించాలని చూస్తోంది. మేం ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నాం. మీకూ మాకు మధ్యన సారూప్యత ఉంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని సంస్కృతులను ప్రజలను ఆహ్వానిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్‌వేలుగా పనిచేయడానికి దోహదపడుతాయి’అన సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.