పవన్ కల్యాణ్ శాఖ పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం

అభివృద్ధి ఆగితే చర్యలు తప్పవు.

జనం న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ఉన్న అటవీశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.‘కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా. కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా వ్యవహరించకూడదు’ అని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ప్రజా కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, జరుగుతోన్న ప్రగతికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు పీపుల్స్ ఫ్రెండ్లీగా మరింతగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక జూనియర్ ఐఏఎస్‌లకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేలా సీనియర్లు సహకరించాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.ఏఐ సాయంతో వైద్య పరీక్షలు నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయం. తక్కువ వ్యయంతో పోర్టబుల్ గా ఉండేలా మెడ్ టెక్ టూల్స్ తయారు చేయాలి. ఆర్టీఐహెచ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణల్ని చేసి ప్రజారోగ్యం కోసం వినియోగిద్దాం’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.‘రూట్, రోడ్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకుని 108 అంబులెన్సులు త్వరితగతిన చేరుకునేలా చూడాలి. మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులను కూడా అతి తక్కువ టైమ్ లో 108 చేరుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వడగాలుల ప్రభావంపై ముందుగానే ప్రచారం చేపట్టాలి. ‘ఈసారి వేసవి ప్రభావం ఎక్కువ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. వడగాలుల ప్రభావంపై ముందుగానే ప్రచారం చేపట్టాలి. వేసవిలో ప్రజలు సురక్షితంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.‘పశువులకు నీటి తొట్టెలను పెద్ద ఎత్తున నిర్మించాం... ఆ తొట్టెల్లో నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి పశు భీమా పథకాన్ని కూడా సమర్ధంగా అమలు చేయాలి. ఎండలో పని చేసే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాలుల వల్ల ఒక్క మరణం కూడా జరగడానికి వీల్లేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కలెక్టర్ల కిందే ఫారెస్ట్ అధికారులు పనిచేయాలి. ‘అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలి. నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. మళ్లీ మరోసారి మాట్లడతాను. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారిపోయింది. కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరు. మారాల్సిన అవసరం ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘అటవీ శాఖ గ్రీన్ కవర్ పెంచే అంశంపై దృష్టి పెట్టాలి. బయోడైవర్సిటీకి వెళ్లాలి. ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాలి. ఫారెస్టు అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పనిచేయాలని గుర్తుంచుకోవాలి. కలెక్టర్లు చెబుతున్నా. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్ధికి అటవీ శాఖ ఆటంకంగా మారకూడదు. ‘సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు, అటవీ, ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వు ల్యాండ్ గుర్తించాలి. కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా..? నడకదారిన శ్రీశైలం వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు.. ఆ తర్వాత రోజే తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది’అని సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజలను ఇబ్బంది పెట్టేలా... కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా వ్యవహరించకూడదు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలు చేయాలి.