
పయనించే సూర్యుడు న్యూస్ : నాలుగు రోజుల ముందే అంటే మార్చి 11నే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అర్హులైన పేదలకు గుర్తించి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసింది. వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీ కంటే ముందే వారికోరిక నెరవేర్చినందుకు తనకెంతో గర్వంగా సంతోషంగా ఉంది అని భూ నిర్వాసితులు చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా వెలుగుమట్ల భూ నిర్వాసితుల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భూ నిర్వాసితుల ఆందోళనలతో ఖమ్మం అట్టుడికింది. అటు రాజకీయ పార్టీలు సైతం ఈ అంశంపై పెద్దఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే భూ నిర్వాసితుల ఆందోళనల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. మార్చి 15లోపు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రోజుల ముందే అంటే మార్చి 11నే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అర్హులైన పేదలకు గుర్తించి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసింది. వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీ కంటే ముందే వారికోరిక నెరవేర్చినందుకు తనకెంతో గర్వంగా సంతోషంగా ఉంది అని భూ నిర్వాసితులు చెప్పుకొచ్చారు.ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలిసి ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. 311 మంది పేదుక ఇండ్లు, ఇండ్ల స్థలాలు ‘మార్చి1న వెలుగుమట్ల భూ నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. భూధాన్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కొందరు వ్యక్తులు ఒక ముఠాలా తయారై పట్టాలు ఇప్పిస్తామని పేదలను నమ్మించి మోసం చేశారు’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.‘బ్రోకర్ల మాటలు నమ్మిన ప్రజలు వారికి అధిక మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారు. ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పేదల కష్టం తెలిసిన ప్రజాప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాలని సంకల్పించింది’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యేక చొరవతో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టి నిజమైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాం అని అన్నారు. 311 మంది పేదలకు స్థలంతో పాటు ఇండ్ల మంజూరు, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు అందజేయడం జరిగింది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పగటి కలలు ‘గత పది ఏళ్లుగా అధికారంలో ఉండి, 2017 నుండి వెలుగుమట్లలో కనీస సౌకర్యాలు లేక నరకయాతన పడుతున్న పేదలను పట్టించుకోని విపక్ష నేతలు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ పగటి కలలు కంటున్నారు’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి "రెడ్ బుక్" రాజకీయాలకు ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారు. మళ్లీ అధికారంలోకి వస్తాం అనే ప్రధాన ప్రతిపక్ష నాయకులు పగటి కలలు మానుకోవాలి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణం పూర్తవ్వడానికి ముందే అన్ని మౌలిక వసతులను ప్రజాప్రభుత్వం కల్పిస్తుంది. వారంలోగా నిర్మాణాలకు ప్రధానంగా అవసరమయ్యే నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమం కోసమే పనిస్తుంది. అనడానికి ఈ రోజు పేదలకు అధికారిక పట్టాలిచ్చి పేదల పక్షాన నిలిచిన సందర్భమే సాక్ష్యం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.