గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త

సాక్షి డిజిటల్ న్యూస్ :దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు వద్దు అని కేంద్రం తెలిపింది. భయాందోళనతో అనవసరంగా బుకింగ్ చేయవద్దు అని సూచించింది. ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసిన రెండున్నర రోజుల్లేనే ఇంటికి డెలివరీ అవుతుంది అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై చూపిస్తోంది.ముఖ్యంగా భారత్‌పైన ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. చమురు,గ్యాస్ సరఫరాలు నిలిచిపోవడంతో భారత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరాకు సంబంధించి హర్మూర్ జల సంధి మూసి వేసిన నేపథ్యంలో రవాణాకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు కూడా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ కొరతపై భయాందోళన వద్దని...అనవసరంగా బుకింగ్ చేయవద్దు అని కేంద్రం సూచించింది. ఎల్పీజీ ఉత్పత్తి 25 శాతం పెంచాం అని అన్నారు. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుంది అని స్పష్టం చేసింది. రెండున్నర రోజుల్లోనే సిలిండర్ దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సామాన్యులకు ఊరటనిస్తూ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇకపై సిలిండర్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని...బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందని స్పష్టం చేసింది. అయితే దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లుగా కేంద్రం పేర్కొంది. దీంతొ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది. అనవసర బుకింగ్ చేయవద్దు దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందని రాబోయే రోజుల్లో ఈ కొరత మరింత పెరిగే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత తీవ్రంగా ఉంటుందనే భయంతో గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా గ్యాస్ బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ బుకింగ్‌లు విరీతంగా పెరిగాయి. ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు వద్దు అని కేంద్ర ప్రకటించింది.అనవసరంగా గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేయవద్దని సూచించింది. ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రోజుకు దాదాపు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురు అందుబాటులో ఉన్నదని మీడియా సమావేశంలో ప్రభుత్వ అధికారి వివరించారు. మరోవైపు ఈ కాలంలో సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే దానికంటే ఎక్కువగా చమురు, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రస్తుతం దేశంలోని డిమాండ్‌ను తీర్చడానికి తగినంత సేకరణ కూడా జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో దయచేసి అనవసరమైన ఎల్పీజీ బుకింగ్‌లను నివారించాలని ప్రజలను కోరింది.