
పయనించే సూర్యుడు న్యూస్ : ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశం, ప్రపంచానికి సంబంధించిన కీలక సమాచారం మీకోసం. రాజకీయాలు, పరిపాలన, ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై తాజా అప్డేట్స్. న్యూస్18 తెలుగు అందిస్తోంది తాజా వార్తలు.. వెంట వెంటనే.. ఇప్పుడే చూడండి. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్‌ను స్వాగతించిన అనంతరం సీఎం అక్కడే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రేపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్ సమక్షంలో శివప్రతాప్ శుక్లా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు లోక్ భవన్లో అధికారులు చేపడుతున్నారు. వంట గ్యాస్‌కే మొదటి ప్రాధాన్యం అని కేంద్రం చెప్పింది. ఎల్ పీజీ పక్కదారి పట్టకుండా ఆంక్షలు విధించింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలను కేంద్రం ప్రారంభించింది. గృహ వినియోగానికే గ్యాస్ వాడాలని నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి కేంద్రం తెచ్చింది. ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం. సోమవారం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. నేడు కోలుకుంటున్నాయి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు లాభాల బాటలో నడుస్తున్నాయి. దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర దిగి రావడంతో మార్కెట్ కోలుకుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 400 పాయింట్లు పైగా లాభాల్లోనూ, నిఫ్టీ 100 పాయింట్లు పైగా లాభాల్లోనూ నడుస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు వేగంగా పెరగడంతో అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సరఫరాపై పరిమితులు విధిస్తూ రేషన్ విధానాన్ని అమలు చేయగా, మరికొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్లో ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చమురు క్షేత్రాలు మరియు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్ర దాడులు జరపడంతో ఉద్రిక్తత పెరిగింది. దీనివల్ల ఒక్క రోజులోనే ముడి చమురు ధర బ్యారెల్‌కు 30 డాలర్లకు పైగా పెరిగింది. ఇక ఇరాన్‌కు చెందిన పలు లక్ష్యాలపై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా పడిపోయాయి.