మార్చి 13న డబ్బులు వచ్చే చాన్స్

రైతులకు కీలక సూచనలు

అక్షర ఆయుధం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన విషయంలో అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా మీడియా రిపోర్టర్ల ప్రకారం మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ యోజన డబ్బుల విడుదల విషయంలో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన విషయంలో అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా మీడియా రిపోర్టర్ల ప్రకారం మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ యోజన డబ్బుల విడుదల విషయంలో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ యోజన డబ్బులను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.పీఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలు రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. . అయితే ఈ డబ్బులను మొత్తం మూడు విడతలుగా 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంకా రెండు నెలలు గడిచిపోయినప్పటికీ పీఎం కిసాన్ యోజన డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో పడలేదు. నిజానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఎకౌంట్లో పడుతున్నాయి. అయితే ఈసారి ఇంకా మార్చి నెల ప్రారంభం అయినప్పటికీ పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఎలాంటి వార్తలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందే అవకాశం ఉంది.పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేసి ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఫార్మర్ ఐడి ఉండాలి, దీంతో పాటు బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన 22 విడత డబ్బులు అకౌంట్లో పడతాయి. ఈ సందర్భాల్లో మాత్రమే పిఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లో పడే అవకాశం లేదు ముఖ్యంగా ఈ కేవైసీ చేయని రైతులు, అలాగే ఒకే కుటుంబంలో ఒకరికి మించి మరొకరు లబ్ధి పొందినట్లయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు ఎకౌంట్లో పడవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ టాక్స్ చెల్లించే రైతులు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు, పీఎం కిసాన్ యోజన డబ్బులు పొందేందుకు అనర్హులు అని చెప్పవచ్చు. పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే ముందుగా చేయాల్సిన పని ఈ కేవైసీ పూర్తి చేయడమే అని చెప్పవచ్చు. లేకపోతే 22 డబ్బులు రైతుల అకౌంట్లో పడవు.పీఎం కిసాన్ యోజన ద్వారా లభించే డబ్బులు, రైతులు రుణం రూపంలో కానీ, సబ్సిడీ రూపంలో కానీ పొందడం లేదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ యోజన ద్వారా లభించిన డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. . ఈ డబ్బులను వ్యవసాయ ఖర్చులకోసం మాత్రమే కాదు వ్యవసాయేతర ఖర్చులకోసం కూడా ఖర్చు చేసుకోవచ్చు.