
అక్షర ఆయుధం ; ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటడమే లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియంను పునరుద్ధరించాం ‘గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’అని సీఎం ఆదేశించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, క్రీడాకారులకు శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి సైతం పాల్గొన్నారు.ప్రభుత్వానికి మద్దతుగా నిలబడండి ‘హైదరాబాద్ అత్యంత పురాతన, ప్రాముఖ్యత కలిగిన నగరం. ఆ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశాం. ఏడాది కిందట బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ఎలా ఉంది. ఇప్పుడేలా ఉంది’అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఈ ఒరిజినల్ సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూడండి. ఆ పనులను చూసి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి... అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నధికారులు పాల్గొన్నారు.IH Hockey World Cup 2026ను ప్రారంభించిన సీఎం రేవంత్ హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల FIH Hockey World Cup 2026 క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ప్రారంభించారు.భారత్‌కు ఉరుగ్వే టీమ్‌కు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్ - ఏ లో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్ - బీ లో ఇండియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వాకిటి శ్రీహరి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.