జనం న్యూస్ : భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి, ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం దక్కాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రపతి పర్యటన అంటే ఎంతో హుందాగా, పకడ్బందీగా జరగాలని, అది ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్, మర్యాదలకు భంగం వాటిల్లడం సరికాదు అని పవన్ కల్యాణ్ హితవు పలికారు. వెస్ట్ బెంగాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన పరిణామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎదుర్కొన్న పరిస్థితులు అత్యంత బాధాకరమని….అవి తనను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.సంతాల్ సామాజిక వర్గం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక సదస్సును నిర్వహించినప్పుడు…అందులో ఆ వర్గానికి దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎవరి కోసమైతే ఈ సదస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో, ఆ సంతాల్ కమ్యూనిటీకి చెందిన సభ్యులే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తడం అత్యంత విచారకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. ఇలాంటి సాంస్కృతిక సమావేశాలు అందరినీ కలుపుకుపోయేలా…సున్నితత్వంతో కూడిన పరిపాలనా ప్రణాళికతో జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు. రాష్ట్రపతి పదవికి ఎల్లప్పుడు అత్యున్నత గౌరవం దక్కాలి: పవన్ కల్యాణ్ మరోవైపు భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి, ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం దక్కాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రపతి పర్యటన అంటే ఎంతో హుందాగా, పకడ్బందీగా జరగాలని, అది ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్, మర్యాదలకు భంగం వాటిల్లడం సరికాదు అని పవన్ కల్యాణ్ హితవు పలికారు. భారతదేశ అస్తిత్వంలో, మన దేశ ఖ్యాతిలో గిరిజన సమాజాలు అంతర్భాగమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.సంతాల్ సంస్కృతి, సంప్రదాయాలు, వారి గళానికి ఎల్లప్పుడూ నిజాయతీతో కూడిన గౌరవం లభించాలని అన్నారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా, రాజ్యాంగ అధిపతికి అసౌకర్యం కలిగించేలా జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా పాలకులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రపతిపట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యహరించిన తీరు సరికాదు: చంద్రబాబు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పించకపోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. మమత బెనర్జీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.‘ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ కల్పించికపోవడాన్ని ఖండించారు. రాష్ట్రపతి పర్యటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరు దురుదృష్టకరమని…. రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యహరించడం బాధకలిగించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందని సూచించారు.రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం సమిష్టి విధి అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది? భారతరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. బిధాన్నగర్లో శనివారం రాష్ట్రపతి పాల్గొనాల్సిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆ కార్యక్రమాన్ని వేరేచోటుకు మార్చాల్సి వచ్చింది. దాంతో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి వెస్ట్ బెంగాల్ చేరుకోగా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతించాల్సిన సీఎం కానీ మంత్రులు కానీ రాలేదు. కేవలం మేయర్‌ను మాత్రమే పంపడంపై రాష్ట్రపతిద్రౌపది ముర్ము తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ముర్ము ఆదేశించారు. అనంతరం బాగ్డోగ్రా విమానాశ్రయానికి సమీపంలోని గోసాయ్‌పూర్‌లో జరిగిన ఈ 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ అంశంపై స్పందించారు. నాకు స్వాగతం పలకడానికి సీఎం రావాలి. కానీ రాలేదు. గవర్నర్ రావాలి అయితే ఆయన బదిలీ అయినందు వల్ల రాలేదు. అని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు అనుకున్నట్లు బిధాన్ నగర్లో ఈ కార్యక్రమం జరిగి ఉంటే బాగుండేది అని అన్నారు. మమత బెనర్జీ నాకు చెల్లిలాంటి వారు. నేనూ బెంగాల్ పుత్రికనే. మరి నేను రావడాన్ని ఆమె ఎందుకు అనుమతించలేదో అర్థం కావట్లేదు అని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎక్స్ వేదికగా కూడా తనకు ప్రోటోకాల్ కల్పించకపోవడంపై ట్వీట్ చేశారు. ‘బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం గురించి పట్టింపు లేదు, అందుకే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.’ని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.