యుద్ధ సమయంలో భారత్‌కు ఊరట

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు అమెరికా అనుమతి

అక్షర ఆయుధం :ఇరాన్‍‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు చమురు సరఫరా విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో యుద్ధం వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి ఇచ్చింది.30 రోజులపాటు చమురు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.