అక్షర ఆయుధం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసెంబ్లీలో శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబునాయుడు మైనర్లు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో మంచి, చెడులను విశ్లేషించుకునే విచక్షణ పెద్దలకు ఉంటుందని కానీ 16 ఏళ్ల లోపు పిల్లలకు ఆ పరిపక్వత ఉండదని ప్రభుత్వం భావించింది. అంతేకాదు మైనర్లు సోషల్ మీడియాను వినియోగించడం వల్ల ప్రాణాంతకమైన సాహసాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయని వాటికి ఆకర్షితులై ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏపీలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.సోషల్ మీడియా వల్ల చిన్నారులు ఆత్మహత్య: నాగబాబు మైనర్లకు సోషల్ మీడియా నిషేధంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడారు. చిన్నారులు సైబర్ నేరాలు, ప్రమాదకరమైన ఆన్‌లైన్ ట్రెండ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో మంచి, చెడులను విశ్లేషించుకునే విచక్షణ పెద్దలకు ఉంటుందని కానీ 16 ఏళ్ల లోపు పిల్లలకు ఆ పరిపక్వత ఉండదు అని జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. గతంలో ‘బ్లూ వేల్ చాలెంజ్’ వంటి ప్రమాదకరమైన క్రీడలకు ఆకర్షితులై ఎంతోమంది చిన్నారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్సీ నాగబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం ‘మెమో చాలెంజ్’, ‘స్కల్ బ్రేకర్ చాలెంజ్’, ‘ఫైర్ చాలెంజ్’ వంటి ప్రాణాంతకమైన సాహసాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయని వాటికి ఆకర్షితులై కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఎమ్మెల్సీ నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.సోషల్ మీడియా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశంపై మాట్లాడారని...సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి పలు ఐరోపా దేశాలు ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాయని ఎమ్మెల్సీ నాగబాబు సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐటీ, పోలీస్, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేసి సోషల్ మీడియా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కోరారు.ట్యాబ్‌లలో సోషల్ మీడియా యాప్‌లు వాడకుండా ప్రత్యేక వ్యవస్థ ఇదిలా ఉంటే సోషల్ మీడియాపై హోం, ఐటీ, విద్యా శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని ఎమ్మెల్సీ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో కేవలం విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. ఆ ట్యాబ్‌లలో సోషల్ మీడియా యాప్‌లను వాడకుండా పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని ఎమ్మెల్సీ నాగబాబు నొక్కివక్కాణించారు. అలాగే పాఠశాలల్లో జరిగే పేరెంట్స్-టీచర్స్ సమావేశాల్లో తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని....తద్వారా చిన్నారుల భవిష్యత్తును కాపాడవచ్చని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు.