అక్షర ఆయుధం: కొత్త పార్టీ ఏర్పాటుపై తిరుమల శ్రీవారి చెంతన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. తాము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని బలంగా నమ్ముతున్నట్లు కవిత అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు కవిత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. జై ఆంధ్ర అంటూ మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని గుర్తు చేశారు.కానీ సత్యం తనవైపు ఉండటం...దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసింది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.కేసులో క్లీన్ చిట్ రావడంతో మెుక్కులు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారంటే తమకు ఎంతో నమ్మకం... ఇష్టం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాల్సిన మెుక్కు ఉంది అని అయితే లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో నేడు ఆ మెుక్కులు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులతోపాటు జాగృతి కుటుంబ సభ్యులు సైతం మెుక్కులు తీర్చుకోనున్నట్లు చెప్పుకచ్చారు. తన రాకకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తమ శ్రేయోభిలాషులు, తమ మేలు కోరేవారంతా వచ్చి స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్న కవిత వారందిరీకీ ధన్యవాదాలు తెలిపారు.శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్న కవిత అంతకుముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి బయల్దేరారు. అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కవిత తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. సిద్ధిపేట లేదా బోధన్ నుంచి పోటీ కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు ఓపెన్ అయిపోయారు. కొత్త పార్టీ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత అధికారికంగా ప్రకటించేశారు.అంతేకాదు కొత్త పార్టీ పేరుపై కూడా పలు హింట్ ఇచ్చారు. తమ పార్టీ పేరులో ఖచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తన కొత్త పార్టీ పేరు ఉండబోతుంది అని కవిత స్పష్టం చేశారు. అంతేకాదు తన పార్టీ తరఫునే 2028 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించేశారు.